News March 19, 2024
రికార్డు సృష్టించిన మలయాళ సినిమా

మలయాళం సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’ చరిత్ర సృష్టించింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లను రాబట్టింది. రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మాలీవుడ్ సినిమాగా మంజుమ్మెల్ బాయ్స్ చరిత్రకెక్కింది. అనుక్షణం ఉత్కంఠ కలిగించే ఈ సినిమాను మైత్రీ మూవీస్ తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Similar News
News April 3, 2025
రూ.కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు: TTD

AP: తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నట్లు TTD వెల్లడించింది. ఏడాదిలో 3రోజులు సుప్రభాత సేవ, 3 సార్లు బ్రేక్ , 4రోజులు సుపథం ప్రవేశ దర్శనాలు కల్పిస్తామంది. రూ.3వేల వసతి గృహంలో 3రోజుల పాటు ఉండొచ్చని చెప్పింది. స్వామివారి లడ్డూలు, వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందొచ్చని తెలిపింది. అలాగే 5గ్రా. శ్రీవారి బంగారం, 50గ్రా. సిల్వర్ డాలర్ అందజేస్తామంది.
News April 3, 2025
HCU విద్యార్థులపై కేసులను ఎత్తివేస్తాం: భట్టి

TG: HCUకు సంబంధించిన భూమిని ఇంచుకూడా ప్రభుత్వం తీసుకోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఢిల్లీలో తెలిపారు. వారిపై దుందుడుకుగా వ్యవహరించవద్దని పోలీసులను ఆదేశించారు. గతంలో బిల్లీరావుకు చంద్రబాబు అప్పనంగా 400 ఎకరాలు కట్టబెడితే నాటి సీఎం వైఎస్సార్ ఆ భూములను కాపాడారని చెప్పారు.
News April 3, 2025
వక్ఫ్ ఆస్తులపై 2006లోనే రూ.12వేల కోట్ల ఆదాయం: రిజిజు

రాజ్యసభలో వక్ఫ్ సవరణ(UMEED) బిల్లుపై చర్చ కొనసాగుతోంది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ‘2006లోనే 4.9లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్‌పై రూ.12వేల కోట్ల ఆదాయం వస్తున్నట్లు సచార్ కమిటీ అంచనా వేసింది. ఇప్పుడు 8.72L ఆస్తులున్నాయి. వీటిపై ఎంత వస్తోందో ఊహించుకోండి’ అని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ప్రజల మతపరమైన స్వేచ్ఛలో జోక్యం చేసుకోదని, ఇప్పటికైనా కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు మద్దతు తెలపాలని కోరారు.