News February 6, 2025
భీమారం: తాళం వేసిన ఇంట్లో చోరీ

భీమారంలోని ఐటీడీఏ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. భీమారం ఎస్ఐ శ్వేత వివరాల ప్రకారం.. రాంటెంకి రంజిత్ కుమార్ జనవరి 31న తన కొడుకు అక్షరాభ్యాసం కోసం సిద్దిపేట మండలంలోని శనిగారం గ్రామానికి వెళ్లాడు. కాగా ఈనెల 5న ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలో రూ.50వేల నగదు, రూ.42వేల విలువ గల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News November 16, 2025
మిర్యాలగూడకు మంత్రులు..ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా

మిర్యాలగూడలో సోమవారం జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి విచ్చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శెట్టిపాలెం నుంచి అవంతిపురం వరకు నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన వంటి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారు.
News November 16, 2025
నా వర్క్‌కు పర్సనల్ నంబర్ వాడను: అదితీరావు

హీరోయిన్ అదితీరావు హైదరీ ఫొటోలను ఉపయోగిస్తూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇన్‌స్టాలో ఓ నోట్ రిలీజ్ చేశారు. ‘ఫొటోషూట్‌ల పేరుతో ఫొటోగ్రాఫర్లకు దుండగులు వాట్సాప్‌లో నా ఫొటో పెట్టుకొని సంప్రదిస్తున్నారు. నేనెప్పుడూ నా వర్క్‌కు పర్సనల్ నంబర్‌ను వాడను. ఏదైనా నా టీమ్ చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
ASF జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక

జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఉదయం 11 గంటలకు జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపికను అసిఫాబాద్‌లోని ఆదివాసీ భవన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 15 నుంచి 29ఏళ్లలోపు వారు ఈ పోటీలలో పాల్గొనవచ్చన్నారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని రాష్ట్ర స్థాయి ఉత్సవాలకు పంపిస్తామని పేర్కొన్నారు.


