News March 19, 2024

శృంగవరపుకోట నుంచి పోటీ చేయాలనుకుంటున్నా: కేఏ పాల్

image

AP: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ‘పిఠాపురంలో పోటీ చేయమని కొందరు అడుగుతున్నారు. ఇప్పటికే విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించా. తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పును తీర్చేస్తా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా. ఎన్టీఆర్‌కు భారతరత్నఇచ్చే వరకు పోరాడుతా’ అని చెప్పుకొచ్చారు.

Similar News

News April 3, 2025

రూమర్స్‌పై ‘ది ప్యారడైజ్‌’ టీమ్ ఆగ్రహం

image

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌తోనే సంచలనం సృష్టించింది. అయితే ఫండింగ్ సమస్య, స్క్రిప్ట్ పట్ల నాని అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్ వచ్చాయి. దీనిపై మూవీ టీమ్ ‘గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి’ అంటూ ఘాటుగా స్పందించింది. ‘మూవీ రైట్ ట్రాక్‌లో ఉంది. TFIలో గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. త్వరలోనే మీ ముందుకు వస్తాం’ అని ట్వీట్ చేసింది.

News April 3, 2025

సాయి సుదర్శన్ పరుగుల ప్రవాహం.. ఓ లుక్కేయండి!

image

35, 11, 20, 65*, 14, 22, 62*, 53, 19, 20, 47, 43, 96, 45, 37, 45, 33, 31, 35, 12, 31, 65, 84*, 6, 103, 74, 63, 49.. GT ఓపెనర్ సాయి సుదర్శన్ గత ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు ఇవి. IPLలో 28 ఇన్నింగ్స్ తర్వాత అత్యధిక పరుగులు(1220) చేసిన లిస్టులో షాన్ మార్ష్ తర్వాత స్థానంలో ఉన్నారు. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం ఆడుతున్న ఇతను.. 2022లో GT ట్రోఫీ గెలవడంలోనూ కీలకపాత్ర పోషించారు.

News April 3, 2025

మోదీ నాకు గొప్ప స్నేహితుడే కానీ..: ట్రంప్

image

పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్.. PM మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ నాకు గొప్ప స్నేహితుడు. కానీ భారత్ మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు. మాపై 52 శాతం టారిఫ్ విధిస్తోంది. మేము ఇండియాపై 26% సుంకం విధిస్తున్నాం’ అని చెప్పారు. సుంకాల ప్రకటనతో అమెరికాకు కంపెనీలు తిరిగి వస్తాయని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ తెలిపారు. US మార్కెట్లో పోటీతత్వం పెరిగి వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.

error: Content is protected !!