News February 6, 2025

BREAKING: మహబూబ్‌నగర్ జిల్లాలో MURDER

image

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్(36) తరచూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్‌‌లో ఈరోజు కూడా మళ్లీ ఆమెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.

Similar News

News July 5, 2025

ఆదిలాబాద్: ఆత్మహత్య పరిష్కారం కాదు!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారు సూసైడ్ చేసుకుంటున్నారు. కారణం చిన్నదైన, పెద్దదైన ఆత్మహత్యే పరిష్కారమని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. బజార్హత్నూర్‌కు చెందిన తరుణ్, లోకేశ్వరం వాసి దేవన్న, లింగాపూర్‌కు చెందిన సరసత్వీ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

News July 5, 2025

ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కళ్యాణి

image

ములుగు జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను నియమిస్తూ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలుగా పని చేస్తున్న తాడ్వాయి మండలం కామారం పీటీ గ్రామానికి చెందిన కళ్యాణిని నియమించింది. నూతన మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన కళ్యాణికి జిల్లా, మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

News July 5, 2025

ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో సత్తాచాటిన మహబూబాబాద్

image

శుక్రవారం విడుదల చేసిన బాసర త్రిబుల్ ఐటీ(రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) ప్రవేశ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా సత్తా చాటింది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 206 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. అందులో మహబూబాబాద్ జిల్లా విద్యార్థులకు 125 సీట్లు వచ్చినట్లు విద్యా శాఖాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.