News February 6, 2025

BREAKING: భారత్ విజయం

image

ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.

Similar News

News February 7, 2025

అవినీతి బ్రహ్మరాక్షసి లాంటిది: జస్టిస్ ఎన్వీ రమణ

image

నిజాయితీ కూడిన మేధావులు దేశానికి కావాలని మాజీ CJI జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ప్రస్తుతం వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులుగా మారి వారితో అవినీతి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతి బ్రహ్మ రాక్షసి లాంటిదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రజలు వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతున్నారన్నారు. పిల్లలకూ రాజకీయాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

News February 7, 2025

కులగణనపై సభకు రాహుల్‌ను ఆహ్వానించాం: భట్టి

image

తెలంగాణలో అమలవుతున్న పథకాలను కాంగ్రెస్ అధిష్ఠానానికి వివరించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. కులగణన వివరాలను కేసీకి అందించామన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని, వీటికి రాహుల్ గాంధీని ఆహ్వానించామని చెప్పారు.

News February 7, 2025

ఫిబ్రవరి 07: చరిత్రలో ఈరోజు

image

✒ 1888: రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జననం(ఫొటోలో)
✒ 1969: సమరయోధుడు ఆమంచర్ల గోపాలరావు మరణం
✒ 1937: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎలిహూ రూట్ మరణం
✒ 1990: కేంద్ర మాజీ మంత్రి మల్లు అనంత రాములు మరణం
✒ 2008: హాస్యనటుడు లక్ష్మీపతి మరణం
✒ 2018: మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం

error: Content is protected !!