News February 6, 2025
పాడేరు: పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి ప్రణాళికలు

పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో అరకు చలి ఉత్సవంలో పాల్గొన్న అధికారులతో సమావేశం నిర్వహించారు. టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేసి, సంబంధిత గ్రామాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీరాజ్, అటవీశాఖ, గిరిజన చట్టాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
Similar News
News December 27, 2025
పెరిగిన ట్రైన్ ఛార్జీలు.. RGM-సికింద్రాబాద్‌కు ఎంతంటే..?

రైల్వే శాఖ రైళ్ల ఛార్జీలను పెంచింది. 215 KMలకు పైగా ట్రావెల్ చేసేవారిపై KMకు పైసా చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 224 KMల దూరమున్న రామగుండం- సికింద్రాబాద్(భాగ్యనగర్, ఇంటర్‌సిటీ) ట్రైన్లకు మొన్నటివరకు రూ.90 టికెట్ ధర ఉండగా పెరిగిన ధరతో అది రూ.95కు చేరింది. ఇక సూపర్‌ఫాస్ట్ ఛార్జ్ రూ.110గా ఉంది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. PDPL-సికింద్రాబాద్‌కు పాత ఛార్జీలే.
News December 27, 2025
పబ్లిక్ ప్లేస్‌లో పావురాలకు మేత వేస్తున్నారా?

చాలామంది రోడ్లమీద, పార్కుల్లో పావురాలకు మేత వేస్తూ ఉంటారు. వాటి వల్ల అనారోగ్య <<15060184>>సమస్యలు<<>> వస్తాయని చెప్పినా లెక్కచేయరు. అయితే అలా చేసిన ఓ వ్యాపారికి ముంబై కోర్టు రూ.5వేలు ఫైన్ వేసింది. అతను చేసిన పనిని హ్యూమన్ లైఫ్, హెల్త్‌కి ముప్పుగా, ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ స్ప్రెడ్ చేసే చర్యగా పేర్కొంది. పావురాలతో మనకు ఎంత ప్రమాదం పొంచి ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News December 27, 2025
ప్రయాణికులకు ఊరట.. ఖమ్మం మీదుగా 10 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మీదుగా మొత్తం పది ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు స్టేషన్ చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ డి.రాజగోపాల్ వెల్లడించారు. ఇందులో ఐదు రైళ్లు ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.


