News February 6, 2025

ఎమ్మెల్సీ కవితను కలిసిన జడ్పీ మాజీ చైర్పర్సన్, మాజీ సర్పంచులు

image

జగిత్యాల జిల్లాకు చెందిన జెడ్పి మాజీ చైర్పర్సన్ దావ వసంత, పలువురు మాజీ సర్పంచులు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను గురువారం కలిశారు. సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇప్పించేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి చేయాలని, రైతు భరోసా నిధులు ఏకకాలంలో రైతులందరికీ అందించాలని ఎమ్మెల్సీ కవితకు విన్నవించినట్లు మాజీ ప్రజాప్రతినిధులు తెలిపారు. బకాయిల విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు వారన్నారు.

Similar News

News April 19, 2026

వేసవి తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదివారం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు. వడదెబ్బ నివారణకు కాటన్ దుస్తులు ధరించాలని, దాహం లేకపోయినా తరచుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ వంటి ద్రవాలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదన్నారు.

News April 19, 2026

పీజీఆర్ఎస్ కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

image

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.

News April 19, 2026

రేపు రైతుభరోసా నిధులు విడుదల.. సీఎం షెడ్యూల్ ఇదే

image

TG: రైతుభరోసా రెండో విడత నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని డ్యామ్ సైట్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కాటారం వెళ్లి బహిరంగ సభలో పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.