News February 6, 2025
ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్ సందీప్ కుమార్

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ కు SRCL కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా ఆర్థిక సాయం అందజేశారు. నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ లలిత దంపతుల పాప బుధవారం ప్రమాదవశాత్తు మరణించగా, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద బుధవారం రాత్రి రూ.లక్ష అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా గురువారం మరో లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
Similar News
News March 8, 2026
NLG: ఆర్టీసీ ప్రగతి చక్రంలోనూ నారీశక్తి..!

TG-RTC అభ్యున్నతిలో మహిళా ఉద్యోగులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో మహిళా సిబ్బంది తమ పనితీరుతో సంస్థకు ఆదాయ వనరులుగా మారారు. 7 డిపోలలో కలిపి మొత్తం 328 మంది మహిళలు విధుల్లో ఉన్నారు. వీరిలో 308 మంది కేవలం కండక్టర్లుగానే సేవలందిస్తూ బస్సులను లాభాల బాటలో నడిపిస్తున్నారు. అత్యధికంగా నల్గొండ డిపోలోనే 80 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తుండటం విశేషం.
News March 8, 2026
CA ఫలితాలు విడుదల

ఛార్టర్డ్ అకౌంటెన్సీ(CA) ఫలితాలను ICAI రిలీజ్ చేసింది. ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల రిజల్ట్స్‌ను <
News March 8, 2026
బోరవెల్లి ‘కవిపోషక రాణి’ గిరియమ్మ

రాజకుమారి గిరియమ్మ బోరవెల్లి కోట సంస్థాన చినసోమభూపాలుడి భార్య. సంతానం లేకపోవడంతో పెద్దసోమభూపాలుని కుమారుడు వెంకటపతిని దత్తత తీసుకున్నారు. గద్వాల కవులు-పండితులను పోషించి కవిపోషక రాణిగా పేరు తెచ్చుకున్నారు. దత్తపుత్రుడు వెంకటపతి కూడా తల్లికి తగ్గట్టుగా సాహిత్యాన్ని ఆదరించారు. 1668లో వెంకటపతి సంస్థానాన్ని గద్వాలలో విలీనం చేసి తన పుట్టినిల్లు గద్వాల సంప్రదాయాన్ని బోరవెల్లిలో తెచ్చి కీర్తిని తెచ్చారు.


