News February 7, 2025
భువనగిరి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738861849641_729-normal-WIFI.webp)
బొమ్మాయిపల్లి, నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గల ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల వివరాలిలా.. పోచంపల్లి మండలం జూలూరుకి చెందిన కేతం గోపాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదు. సికింద్రాబాద్ నుంచి విష్ణుపురం వైపు వెళ్లే ఆఫీసర్ స్పెషల్ ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 7, 2025
సమ్మక్క-సారలమ్మ గద్దెలపై హుండీలు ఏర్పాటు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738860550957_20316190-normal-WIFI.webp)
మేడారం చిన్న జాతర ఈనెల 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో ఎండోమెంట్ అధికారులు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 14 హుండీలు, సారలమ్మ గద్దెపై 14 హుండీలు, పగిడిద్దరాజు గద్దెపై 2 హుండీలు, గోవిందరాజుల గద్దెపై 2 హుండీలు మొత్తం 32 హుండీలను ఏర్పాటు చేశారు. ఈవో రాజేంద్రం, సూపర్డెంట్ క్రాంతి, పరకాల డివిజన్ ఇన్స్పెక్టర్ కవిత, దేవాదాయ అర్చకులు పాల్గొన్నారు.
News February 7, 2025
మే, జూన్ నెలల్లో 2 పథకాల అమలు: మంత్రి కొలుసు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736771375490_695-normal-WIFI.webp)
AP: తాము అధికారంలోకి వచ్చాక ఉచిత సిలిండర్లు, అన్న క్యాంటీన్లు అమలు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తల్లికి వందనం(విద్యార్థికి ₹15K), అన్నదాత సుఖీభవ(రైతుకు ₹20K) పథకాలను మే, జూన్ నెలల్లో అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ప్రారంభిస్తామని CM CBN సైతం వెల్లడించారు. అన్నదాత సుఖీభవను 3 విడతలుగా అందిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
News February 7, 2025
ఏలూరు ఆర్‌ఐవోగా యోహన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738848613961_51671582-normal-WIFI.webp)
ఏలూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి(ఆర్ఐవో)గా కె.యోహన్ నియమితులయ్యారు. ఏలూరు కోట దెబ్బ ప్రాంతంలోని కార్యాలయంలో ఆయన గురువారం బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత కలెక్టర్ వెట్రి సెల్విని కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఆగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ ఏలూరు జిల్లా ఆర్ఐఓవోగా నియమితులయ్యారు.