News February 7, 2025
మహారాష్ట్రలో 173 GBS కేసులు

మహారాష్ట్రలో <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్<<>> కేసుల సంఖ్య 173కి చేరింది. ఇవాళ కొత్తగా 3 కేసులు నమోదవగా, ఒక మరణం సంభవించింది. దీంతో ఆ రాష్ట్రంలో GBS అనుమానిత మరణాల సంఖ్య 6కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 72 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. పుణే సిటీలో 34, మున్సిపాలిటీ సరిహద్దు గ్రామాల్లో 87, ఇతర ప్రాంతాల నుంచి మిగిలిన కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News March 16, 2026
భారత్‌కు గుడ్ న్యూస్.. గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్

హార్ముజ్ జలసంధిలో అడ్డంకులను దాటుకున్న శివాలిక్ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు కొన్ని గంటల్లో చేరుకోనుంది. ఇందులో దాదాపు 40-46 వేల మెట్రిక్ టన్నుల LPG ఉంది. దీని రాకతో దేశంలో గ్యాస్ కష్టాలు కొంత వరకు తగ్గనున్నాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక కూడా అతి త్వరలో భారత్‌కు చేరుకోనుంది. దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోంది.
News March 16, 2026
టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల లోపే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యమైన స్టూడెంట్స్‌ను ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటలవరకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది.
News March 16, 2026
సిగరెట్, మద్యంతో మతిమరుపు!

వయసుతో సంబంధం లేకుండా కొన్ని అలవాట్లు మెదడు పరిమాణాన్ని తగ్గిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘నిద్రలేమి, ఒత్తిడి, ఊబకాయం, మధుమేహం, వ్యాయామం లేకపోవడం వల్ల మెదడు వేగంగా కుంచించుకుపోతుంది. విటమిన్ B12 లోపం, ఒంటరితనం, ధూమపానం, మద్యపానం వల్ల కూడా పరిమాణం తగ్గి మతిమరుపు వచ్చే ప్రమాదం ఉంది. సరైన నిద్ర, పౌష్టికాహారం, రోజూ వ్యాయామం చేసి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’ అని సూచిస్తున్నారు.


