News February 7, 2025
కోవ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కోవ లక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల సేవకు అంకితమై సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సుధీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు.
Similar News
News February 27, 2026
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల రహిత జిల్లాగా యాదాద్రిని తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. గురువారం ఆలేరు పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, శాంతిభద్రతలతో పాటు ట్రాఫిక్ నిబంధనల అమలుపై సమీక్షించారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
News February 27, 2026
రైల్వేస్టేషన్‌లో స్పృహ కోల్పోయిన వ్యక్తి మృతదేహం ఇంకా మార్చురిలోనే

విశాఖ రైల్వేస్టేషన్‌లో ఈ నెల23న ప్లాట్ఫారం1 గేట్ నం.3 సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ వ్యక్తిని రైల్వేపోలీసులు గమనించి KGHకి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందాడు. ఆ మృతదేహం ఇంకా KGH మార్చూరిలో ఉండగా, మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే GRP పోలీసులను సంప్రదించాలని కోరారు.
News February 27, 2026
భారత్ ఘన విజయం

T20WC: జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్య ఛేదనలో ZIM బ్యాటర్లు 184-6 రన్స్‌కే పరిమితమయ్యారు. బెనెట్(97*) ఒంటరి పోరాటం చేశారు. కెప్టెన్ రజా(31) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్, అక్షర్, దూబే తలో వికెట్ తీశారు. మార్చి 1న వెస్టిండీస్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది.


