News February 7, 2025
KMM: సీఎం కప్ ఫుట్‌బాల్ విజేతలకు కలెక్టర్ అభినందన

సీఎం కప్ ఫుట్‌బాల్ పోటీల్లో విజయం సాధించిన వివిపాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం కలెక్టరేట్‌లో అభినందించారు. అండర్-13, 15, 17 గ్రూపుల్లో రన్నర్స్‌గా నిలవడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. టీమ్ కోచ్ మాధురికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కోచ్ ఆదర్శ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 14, 2026
గ్యాస్ అక్రమాలపై కఠిన చర్యలు: DSO చందన్ కుమార్

ఖమ్మం జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSO చందన్ కుమార్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ ఉంచడం సహించబోమన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన వారికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించారు.
News March 14, 2026
ఖమ్మం: ఎస్సీ సబ్సిడీ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలో 2025–26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద సబ్సిడీ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ నెల 17 నుంచి 24 వరకు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంపుల పంపిణీలో గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హులైన ఎస్సీ యువత అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News March 14, 2026
ఖమ్మంలో ఆర్టీసీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ దరఖాస్తులు

టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం సరీరామ్ తెలిపారు. బీఎస్సీ, బీకాం, బిబిఏ, బీసీఏ, బీఏతో పాటు ఇంజనీరింగ్ డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిషిప్‌కు అర్హులని చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.


