News February 7, 2025
నరసరావుపేట: పి-4 పాలసీ అమలు పై వీడియో కాన్ఫరెన్స్

ప్రభుత్వ ప్రయివేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటినీ ప్రగతి పథంలో నడిపించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పి-4 పాలసీని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి పి-4 ప్రణాళికపై రాష్ట్రప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 18, 2026
వర్షాకాల సమావేశాల్లో మళ్లీ మహిళా బిల్లు?

మహిళా రిజర్వేషన్ల బిల్లును మరోసారి లోక్‌సభ ముందుకు కేంద్రం తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జులైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. దాంతోపాటే డీలిమిటేషన్ బిల్లునూ సభ ముందు ఉంచాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో ఏం నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
News April 18, 2026
కోచ్ వేధిస్తున్నాడు: నీరజ్ చోప్రా

కోచ్ నావల్‌సింగ్ మానసికంగా వేధిస్తున్నాడని.. తమను, కుటుంబీకులను బూతులు తిడుతున్నాడని ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, పారాలింపిక్ ఛాంపియన్ సుమిత్ అంటిల్ సహా మరికొందరు అథ్లెట్లు ‘సాయ్’కి ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి దూషిస్తున్నాడని, పోటీలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన ప్రవర్తన దారుణంగా ఉంటోందని సుమిత్ వాపోయారు. ఇలాంటి వ్యక్తులతో క్రీడావ్యవస్థకే చెడ్డపేరని, తక్షణమే చర్యలు తీసుకోవాలని నీరజ్ కోరారు.
News April 18, 2026
జ్ఞానులకు, అహంకారులకు మధ్య తేడా ఇదే!

నిండు నదులు పారు నిల్చి గంభీరమై
వెర్రివాగు పారు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గొప్ప నదులు గంభీరంగా, నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. కానీ చిన్న వాగులు మాత్రం ఎగిరెగిరి పడుతూ, శబ్దం చేస్తూ వేగంగా ప్రవహిస్తాయి. ఇదేవిధంగా జ్ఞానులు శాంతంగా, నిదానంగా ఉంటారు. అల్పులు మాత్రం తొందరపాటుతో అహంకారంగా మాట్లాడుతారు.
<<-se>>#PADHYAM<<>>


