News February 7, 2025

ELR: అందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

image

ఏలూరు జిల్లాలో ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించనున్నారు. సంబంధిత వాల్ పోస్టర్లను డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం విడుదల చేశారు.DMHO ఆర్.మాలతి మాట్లాడుతూ.. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల లోపు ఉన్న వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని ఆదేశించారు. వీటిని తీసుకుంటే నులిపురుగులు రావని చెప్పారు.

Similar News

News March 8, 2026

NZB: కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు

image

కేంద్రీ విద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయులను భర్తీకి సోమవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వర రావు తెలిపారు. నిజామాబాద్, బోధన్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయులను నియమించడానికి NZB కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆయన సూచించారు.

News March 8, 2026

NZB: కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూరగాయల ధరలు సాధారణంగా ఉన్నప్పటికీ టమాటా ధర తక్కువకు పడిపోయి రైతులు నష్టాల్లో ఉన్నారు. కాయగూరల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ.10, ఆలుగడ్డ రూ.35, బెండకాయ రూ.50, ఉల్లిగడ్డ రూ.30, పచ్చిమిర్చి, వంకాయ, క్యాబేజీ, క్యారెట్, చిక్కుడుకాయ, క్యాప్సికం రూ.50, పాలకూర రూ.60, ఉల్లిపొరక రూ.15(కట్ట), సొరకాయ 20(ఒకటి), ములక్కాయ, బీరకాయ రూ.60, కొత్తిమీర రూ.10(కట్ట)గా ఉన్నాయి.

News March 8, 2026

నరసరావుపేట: భారీగా తగ్గిన కోడిగుడ్ల ధరలు.. తగ్గనంటున్న చికెన్!

image

నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ.150గా ఉంది. స్కిన్ రూ.240-260, స్కిన్ లెస్ రూ.250-270లుగా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.900-1,000 రేటు పలుకుతోంది. ఇటు కోడిగుడ్ల ధరలు బాగా తగ్గాయి. 100 కోడిగుడ్లు రూ.425గా వ్యాపారులు అమ్ముతున్నారు. ఈ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.