News February 7, 2025
ఇంద్రవెల్లిలో మండలస్థాయి ప్రజావాణి

రాష్ట్రంలో మొట్టమొదటి సారి ప్రజావాణి కార్యక్రమం మండల స్థాయిలో ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రారంభమైందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఇంద్రవెల్లి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం బహిరంగ విచారణ జరిగింది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లనవసరం లేదన్నారు. DRDA పీడీ రవీందర్, కిసాన్ మిత్ర రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీహర్ష, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 20, 2026
ఆదిలాబాద్: రేపు, ఎల్లుండి ఇంటర్ ప్రాక్టికల్స్

ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు DIEO జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ఈనెల 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 24న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా, జిల్లాలోని 75 జూనియర్ కళాశాలలకు పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఎగ్జామ్స్‌కు తప్పక హాజరయ్యేలా చూడాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.
News January 20, 2026
ఆదిలాబాద్: రూ.40 పెరిగిన పత్తి ధర

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,700గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.40 పెరిగినట్లు వెల్లడించారు.
News January 19, 2026
రూ.4.25 కోట్ల వడ్డీ లేని రుణాలు: ADB కలెక్టర్

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 1049 సంఘాలకు గాను రూ.4,25,70,880 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కమిషనర్ సీవీఎన్ రాజు పాల్గొన్నారు.


