News February 7, 2025

కాకినాడ నుంచి కుంభమేళకు మరో రైలు

image

కాకినాడ నుంచి ప్రయాగరాజ్‌కు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఫిబ్రవరి 20న కాకినాడ నుంచి ఏసీ బోగీలతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన విషయం విధితమే. తాజాగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ సూచన మేరకు ఈనెల 8న మరో అదనపు రైలు ఏర్పాటు చేశారు. ఈ రైలు కాకినాడలో 8వ తేదీ మధ్యాహ్నం 2.30కు బయలుదేరుతుందని, రెండు రోజుల తర్వాత ప్రయాగరాజ్ చేరుకుంటుందని ఎంపీ కార్యాలయం వెల్లడించింది.

Similar News

News March 24, 2026

కావలి: సార్.. నేనే బతికే ఉన్నా..!

image

నెల్లూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. కావలి మండలం అన్నగారిపాలేనికి చెందిన బొబ్బల రమణమ్మ ఆధార్ కార్డు తీసుకుని రేషన్ షాపు వద్దకు వెళ్లారు. బియ్యం ఇవ్వాలని అడిగితే ‘నువ్వు చనిపోయావని చూపిస్తోంది. నీకు బియ్యం ఇవ్వడం కుదరదు’ అని డీలర్ చెప్పారు. తానే బతికే ఉన్నానని.. ప్రతినెలా పెన్షన్ కూడా ఇస్తున్నారని ఆమె చెప్పారు.

News March 24, 2026

అమలాపురంలో 27న జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 27న ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు మరిన్ని వివరాల కోసం 8978905032 నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.

News March 24, 2026

72 గంటల ముందుగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రిఫండ్

image

టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్లో రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై 72 గంటల ముందుగా టికెట్‌ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం(నామమాత్రపు ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ కట్ అవుతుంది) తిరిగి ఇవ్వనుంది. 72 నుంచి 24 గంటల్లోపు అయితే 25 శాతం, 24 గంటల నుంచి 8 గంటల్లోపు అయితే 50 శాతం కట్ చేయనుంది. 8 గంటల్లోపు అయితే ఎలాంటి రిఫండ్ ఉండదు. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో ఈ రూల్స్‌ను అమల్లోకి తేనుంది.