News February 7, 2025
సిద్దిపేట: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: DMHO

ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సిద్దిపేట డీఏంహెచ్‌ఓ పాల్వన్ కుమార్ సూచించారు. గురువారం జిల్లాలోని జగదేవ్ పూర్, తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పనితీరును రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. తర్వాత ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్‌లలో నిర్వహిస్తున్న పరీక్ష నమూనాలను పరిశీలించారు.
Similar News
News January 17, 2026
ఆదిత్యుని సేవలో.. శ్రీకాకుళం కలెక్టర్

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ప్రసాద్ ఆయనకు తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
News January 17, 2026
VKB: చీకట్లో వైద్యం.. ప్రభుత్వ ఆసుపత్రిలో అవస్థలు

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్లూకోజ్, డెలివరీ గదుల్లో లైట్లు లేకపోవడంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. శనివారం కామునిపల్లి నుంచి వచ్చిన ప్రసవ కేసు విషయంలో లైట్లు లేక గర్భిణి పడ్డ అవస్థలు వర్ణనాతీతం. అత్యవసర సమయంలోనూ వెలుతురు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News January 17, 2026
ఉద్యమ పార్టీగా ఎన్నో ఒడిదుడుకులు చూశాం: కొప్పుల

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ధర్మపురిలో మాట్లాడుతూ.. అధికార పార్టీకి ధన బలం, అధికార బలం ఉంటే.. BRSకు ప్రజాబలం ఉందన్నారు. పార్టీ మారినవారి గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఒక ఉద్యమ పార్టీగా ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూశామని వ్యాఖ్యానించారు. KCR హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.


