News February 7, 2025

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి: నిర్మల్ కలెక్టర్

image

జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఎస్పీలు రాజేష్ మీనా, ఉపేంద్రా రెడ్డి, ఆర్డీఓ రత్నకళ్యాణి, R&B ఈఈ అశోక్ కుమార్, ఆర్టీవో దుర్గపసాద్ పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

విద్యుత్తు అధికారులు నిర్లక్ష్యంగా ఉండరాదు: CMD

image

ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో APSPDCL సీఎండీ పుల్లారెడ్డి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్య ఘర్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, స్మార్ట్ మీటర్ల గురించి చర్చించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు సూచించారు. జిల్లాలో సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు అధికంగా ఏర్పాటు చేసేలా ప్రతి అధికారి ఓ లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు.

News November 13, 2025

ఇందిరమ్మ మహిళా డెయిరీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి: Dy.CM

image

ముదిగొండ మండలం గంధసిరిలోని ఇందిరమ్మ మహిళా డెయిరీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గురువారం సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని సూచించారు. పశుగ్రాసం సరఫరా, షెడ్ల నిర్మాణం ఉపాధి హామీ ద్వారా పూర్తి చేయాలన్నారు. అలాగే, పాఠశాలలు, యంగ్ ఇండియా స్కూల్, మధిర ఆసుపత్రి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News November 13, 2025

ములుగు: బీజాపూర్ ఎన్ కౌంటర్ మృతులు వీరే..!

image

బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల వివరాలను ఎస్పీ జితేంద్ర వెల్లడించారు. బుచ్చన్న, ఊర్మిళ, జగత్ తామో, దేవి, భగత్, మంగ్లీ ఓయం అనే ఆరుగురు మృతులను గుర్తించామన్నారు. వీరిపై రూ.27 లక్షల రివార్డు ఉందన్నారు. వీరి వద్ద 2 ఇన్సాస్ రైఫిళ్లు, 9 ఎంఎం కార్బన్, 303 రైఫిల్, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయన్నారు.