News February 7, 2025
కర్లపాలెం PSను తనిఖీ చేసిన ఎస్పీ

కర్లపాలెం పోలీస్ స్టేషన్‌ను బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెల్మెట్ అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News April 18, 2026
సంగారెడ్డి: ఈనెల 20 నుంచి ఓపెన్ పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఇప్పటికే ఏప్రిల్ 9 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు.
News April 18, 2026
సంగారెడ్డి: ఎన్నికలకు హాజరయ్యే హోంగార్డులకు మెడికల్ కిట్లు

తమిళనాడు ఎన్నికలకు హాజరయ్యే హోంగార్డు సిబ్బందికి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పారితోష్ పంకజ్ ఆధ్వర్యంలో మెడికల్, నిత్యవసర కిట్లను శనివారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది కోసం ప్రథమ చికిత్స కిట్టుతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
News April 18, 2026
మహిళా బిల్లును ప్రవేశపెట్టిన DMK

డీలిమిటేషన్‌కు లింక్ చేసి ప్రవేశపెట్టిన మహిళా బిల్లు నిన్న వీగిపోయిన నేపథ్యంలో NDAకు కౌంటర్‌గా రాజ్యసభలో DMK ఈరోజు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్, సెన్సస్ అవసరం లేకుండా 543 లోక్‌సభ స్థానాల్లోనే 33% మహిళలకు కేటాయించాలని ప్రతిపాదించింది. రాష్ట్రాలు, UTలైన పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్ సహా ఢిల్లీ NCRకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. సీట్లను, నియోజకవర్గ పరిధులను మార్చాల్సిన అవసరం లేదంది.


