News February 7, 2025
పులివెందుల: రాజహంస వాహనంపై శ్రీనివాసుడు

శ్రీ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివెందులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి రాజ హంస వాహనంపై సరస్వతీ రూపంలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Similar News
News March 27, 2026
ఒంటిమిట్ట రామయ్య కళ్యాణానికి ముత్యాల తలంబ్రాల తయారీ ప్రారంభం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కళ్యాణానికి శుక్రవారం నుంచి ముత్యాల తలంబ్రాల తయారీని ప్రారంభించారు. స్థానిక టీటీడీ భక్తుల వసతి భవనంలో శ్రీవారి సేవకుల సహాయంతో ఈ కార్యక్రమంలో తలంబ్రాల పొట్లాలను తయారు చేశారు. రామయ్య కళ్యాణం రోజు 1.10 లక్షల ముత్యాల తలంబ్రాల పొట్లాలను భక్తులకు అందజేయనున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
News March 27, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,950
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,754
*వెండి 10 గ్రాముల ధర రూ.2,328
News March 27, 2026
శ్రీరామనవమి ప్రశాంతంగా జరుపుకోవాలి: SP

శ్రీరామనవమి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నచికేత్ గురువారం కోరారు. శ్రీరామచంద్రునికి జీవితం మనందరికీ ఆదర్శమన్నారు. శ్రీ రామచంద్రుని బాటలో ప్రజలంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీరామనవమి ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు.


