News February 7, 2025
బీసీ కులగణన సర్వే చారిత్రాత్మకం: మంత్రి కొండా

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన బీసీ కులగణన సర్వే చారిత్రాత్మకం అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఒక బీసీ బిడ్డగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె గురువారం కాంగ్రెసు హైకమాండ్‌కు లేఖలు రాశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీ తదితరులకు లేఖలు పంపినట్లు తెలిపారు.
Similar News
News December 25, 2025
అరటి సాగుకు పిలకల ఎంపికలో జాగ్రత్తలు

ఆరోగ్యవంతమైన అరటి తోటల నుంచే పిలకలను ఎంపిక చేయాలి. 3 నెలల వయసు, 2 లేదా 3 కోతలు పడిన సూడి పిలకలను ఎన్నుకోవాలి. పిలకలపై చర్మాన్ని పలచగా చెక్కి లీటరు నీటికి 2.5ml మోనోక్రోటోపాస్, కాపర్ ఆక్సీక్లోరైడ్ 5గ్రా. కలిపిన ద్రావణంలో 15 ని. ముంచి నాటాలి. పొట్టి పచ్చ అరటిని 1.5X1.5 మీ. దూరంలో, గ్రాండ్ నైన్, తెల్లచక్కెరకేళిని 1.8×1.8 మీ.. మార్టిమాన్, కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు బొంతలను 2×2 మీ. దూరంలో నాటాలి.
News December 25, 2025
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి

కాంగ్రెస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులను మంత్రి ఘనంగా సన్మానించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
News December 25, 2025
198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

TGSRTCలో 198 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ 114 ఉద్యోగాలను TSLPRB భర్తీ చేయనుంది. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు పేస్కేల్ రూ.27,080-రూ.81,400 ఉంటుంది. అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు <


