News March 19, 2024
హోం ఓటింగ్‌కు నోటిఫికేషన్ విడుదల
AP: మే 13న జరగనున్న ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12 సమర్పించాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు. శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతిస్తారు. పోలింగ్ తేదీకి 10 రోజుల ముందే ఇంటి నుంచి వారు ఓటు వేయవచ్చు. ఆ ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్సుల్లో ఉంచుతారు.
Similar News
News November 24, 2024
IPL మెగా వేలం అప్డేట్స్
*స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన SRH
*ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపాను రూ.2.4 కోట్లకు దక్కించుకున్న SRH
*రూ.4.80 కోట్లకు ఖలీల్ అహ్మద్‌ను కొన్న CSK
*రూ.6.50 కోట్లకు నోర్ట్జేను సొంతం చేసుకున్న KKR
*అఫ్గాన్ ఓపెనర్ గుర్బాజ్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన KKR
*మహీశ్ తీక్షణను రూ.4.4 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్
News November 24, 2024
స్టార్ బౌలర్‌ను కొన్న ముంబై ఇండియన్స్
IPL: వేలంలో లేటుగా ఎంట్రీ ఇచ్చిన ముంబై స్టార్ బౌలర్ బౌల్ట్‌ను సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న అతడిని రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ న్యూజిలాండ్ పేసర్ IPLలో 103 మ్యాచులు ఆడి 121 వికెట్లు పడగొట్టారు. గతంలో ముంబై, రాజస్థాన్ తరఫున ఆడారు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బతీయడం ఇతడికి వెన్నతో పెట్టిన విద్య. MIలో బుమ్రాకు బౌల్ట్ తోడవడంతో బౌలింగ్ స్ట్రాంగ్ అయింది.
News November 24, 2024
నట్టూకు రూ.10.75 కోట్లు
IPL మెగా వేలంలో పేసర్ నటరాజన్ మంచి ధర పలికారు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న అతడిని రూ.10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇతడు IPLలో 61 మ్యాచులు ఆడి 67 వికెట్లు తీశారు. యార్కర్లు, స్లో బాల్స్‌తో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో నట్టూ స్పెషలిస్ట్.