News February 7, 2025
శ్రీశైలంలో మహా శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

శ్రీశైలంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి ఏర్పాట్లను ఈవో శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. రక్షిత మంచినీటి సరఫరా, నిర్మాణంలో ఉన్న మినీ కల్యాణకట్ట, పలు పార్కింగ్ ప్రదేశాలు, గణేశ సదన్ ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్కింగ్, సీఆర్ఓ వద్ద పార్కింగ్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News November 8, 2025
సిరిసిల్ల: ఆటో- బైక్ ఢీ.. పలువురికి తీవ్రగాయాలు

సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాక- జగ్గారావుపల్లి గ్రామాల మధ్య రోడ్డుప్రమాదం జరిగింది. కొదురుపాక నుంచి ప్రయాణికులతో జగ్గారావుపల్లి వైపు వస్తున్న ఆటోను రాంగ్ రూట్లో వచ్చిన బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆటో బోల్తా పడగా.. మద్యం మత్తులో ఉన్న బైకర్‌తో పాటు ఆటోలోని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News November 8, 2025
దొంగ-పోలీస్ గేమ్ ఆడుదామని అత్తను చంపేసింది!

AP: దొంగ-పోలీస్ గేమ్ పేరుతో అత్తను కోడలు చంపేసిన ఘటన విశాఖ(D) పెందుర్తిలో జరిగింది. మహాలక్ష్మీ(63), ఆమె కోడలు లలిత మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆమెపై పగ పెంచుకున్న కోడలు దొంగ-పోలీస్ ఆడుదామంటూ అత్త కళ్లకు గంతలతో పాటు కాళ్లు, చేతులు కట్టేసింది. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీపం అంటుకొని చనిపోయినట్లు PSకు సమాచారం అందించింది. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.
News November 8, 2025
మెదక్: ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

చర్చ్ అఫ్ సౌత్ ఇండియా మెదక్ కేథడ్రల్ పాస్టరేట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 20 మంది సభ్యుల ఎన్నిక కోసం మొత్తం 60 మంది అభ్యర్థులు(జీఎస్‌పీ, పాస్‌నేట్, ఆల్ఫా ఒమేగా ప్యానెల్‌ల తరపున) పోటీపడ్డారు. 1712 మంది సభ్యులుండగా 1451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.75% పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు ఫలితాలు రానున్నాయి. పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.


