News February 7, 2025
ఆసిఫాబాద్ ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్

ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న యాదయ్య దీర్ఘకాలిక సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News March 7, 2026
భిక్కనూర్: పురుగుల అన్నంపై విచారణ

భిక్కనూర్ మండలం భగీరథపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పురుగుల అన్నంపై శనివారం విచారణ జరిపారు. విద్యార్థులకు పురుగులతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టడంతో విద్యార్థులు పారబోశారు. దీనిపై విచారణ జరిపించాలని ఎన్సీడీ వైద్యాధికారి శిరీషను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఈ మేరకు ఆమె పాఠశాలకు వెళ్లి బియ్యాన్ని పరిశీలించారు. ఏజెన్సీ నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం వివరాలు సేకరించారు.
News March 7, 2026
అవార్డుతో ‘తెలంగాణ కోడలికి’ వెల్కమ్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ

TG ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో హీరోయిన్ రష్మిక ‘ఉత్తమ నటి’ అవార్డు గెలుచుకోవడంపై ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రష్మికను ‘తెలంగాణ కోడలు’గా అభివర్ణిస్తూ.. ఈ పురస్కారం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఘన స్వాగతం పలికిందని Xలో సందడి చేస్తున్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని అవార్డులు, సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. వారం క్రితమే విజయ్ దేవరకొండను రష్మిక మనువాడారు.
News March 7, 2026
రేకులకుంటలో అంగన్వాడీ కేంద్రం తనిఖీ

బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలో అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో వయసుకు తగ్గ ఎత్తు, బరువు పిల్లలు ఉన్నారా, లేదా అని పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారా అంటూ ఆరా తీశారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు మంచి భోదన అందజేయాలన్నారు.


