News February 7, 2025

సమాచారం ఇస్తే రూ.5 వేలు: ములుగు SP

image

పంట రక్షణ నెపంతో చేను చుట్టూ కరెంటు పెట్టిన వారి సమాచారం అందిస్తే రూ.5 వేలు బహుమతి ఇవ్వడం జరుగుతుందని ములుగు ఎస్పీ శబరిశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పంట రక్షణ కోసం, పందుల వేట కోసం విద్యుత్ తీగలు అమర్చడం ద్వారా విషాద ఛాయలు మిగులుతాయన్నారు. విద్యుత్ పెట్టిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్, 105 ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు.

Similar News

News February 7, 2025

రెండు కుటుంబాలను చిదిమేసిన రోడ్డు ప్రమాదం

image

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తీక్(21), తరుణ్(19) <<15378854>>మృతి చెందిన<<>> సంగతి విదితమే. సరదాగా బైక్‌పై బయటకు వెళ్లిన ఇద్దరినీ మృత్యువు కబళించింది. కాగా చిన్న వయస్సులోనే ఇంటి బాధ్యతలు మోస్తున్న యువకులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కార్తీక్ తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందగా ప్రస్తుతం రవాణా కూలీగా చేస్తున్నారు. తరుణ్ ఓ బట్టల షాపులో పని చేస్తున్నారు.

News February 7, 2025

రూ.99లతో విజయవాడ నుంచి హైదరాబాద్

image

విజయవాడ-హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించారు. 3,4 వారాల తర్వాత ఇవి తిరుగుతాయన్నారు. బస్సు సేవలు మొదలైన తర్వాత రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు టికెట్ ఛార్జీ ఉంటుందన్నారు. ఈ విధంగా నాలుగు వారాల పాటు ఉంటుందన్నారు. 

News February 7, 2025

భువనగిరి: వెటర్నరీ డాక్టర్‌పై అడవి దున్న దాడి 

image

యాదాద్రి జిల్లాలో కొన్ని రోజుల నుంచి అడవి దున్న హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో ప్రత్యక్షమవగా సాయంత్రం వలిగొండ శివారులో కనిపించింది. ఫారెస్ట్ అధికారులు దున్నను పట్టుకునే ప్రయత్నంలో చేయగా జూడా సజావుద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేసినట్లు డీఎఫ్ఓ పద్మజారాణి తెలిపారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించామన్నారు.

error: Content is protected !!