News February 7, 2025
ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి: ASF కలెక్టర్
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో ఎస్పీ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పట్టబద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి సభ్యుల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News February 7, 2025
ఓర్వకల్లు వద్ద ఘోర ప్రమాదం.. UPDATE
ఓర్వకల్లు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులు జానకి(60), విహారిక(4) కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది.
News February 7, 2025
చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి 18వ ర్యాంకు
చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పనితీరుకు 18వ ర్యాంకు లభించింది. రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. కాగా చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రి పదవి దక్కని సంగతి తెలిసిందే.
News February 7, 2025
స్థానిక ఎన్నికలు: సంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు
గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన సంగారెడ్డి జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ZPTC-27, MPP-27,MPTC-276, గ్రామ పంచాయతీలు 633 ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 295 నుంచి 276కు తగ్గించారు. జడ్పీటీసీలు 25 నుంచి 27కు పెరిగాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.