News February 7, 2025
కులగణనపై సభకు రాహుల్‌ను ఆహ్వానించాం: భట్టి

తెలంగాణలో అమలవుతున్న పథకాలను కాంగ్రెస్ అధిష్ఠానానికి వివరించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. కులగణన వివరాలను కేసీకి అందించామన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని, వీటికి రాహుల్ గాంధీని ఆహ్వానించామని చెప్పారు.
Similar News
News March 21, 2026
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. సిట్ అదుపులో అభిషేక్ సింగ్

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ను సిట్ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. అతని సెల్ ఫోన్ డేటా ఆధారంగా విచారణ జరుగుతోంది. అభిషేక్ నుంచి BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. రోహిత్ రెడ్డికి అతను 24 సార్లు మత్తుపదార్థాలు సరఫరా చేసినట్లు తెలుస్తోంది.
News March 21, 2026
తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్

TG: ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రకారం తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.11,29,735తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2,3వ ప్లేస్‌లో HYD(రూ.4,76,679), సంగారెడ్డి(రూ.3,94,587) ఉన్నాయి. రూ.2,37,809 అత్యల్ప తలసరి ఆదాయంతో హనుమకొండ చివరి స్థానంలో ఉంది. కరవు ప్రాంతంగా ముద్రపడ్డ MBNR రూ.3,36,898తో ఆరో ప్లేస్‌కు చేరుకోవడం విశేషం. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందుండటం కొసమెరుపు.
News March 21, 2026
ధురంధర్-2 తెలుగు వెర్షన్ నేటి నుంచే..

ధురంధర్-2 తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజ్‌లు స్క్రీనింగ్ అవుతున్నాయి. కేవలం హిందీలోనే వచ్చిన పార్ట్-1 బ్లాక్‌బస్టర్ కావడంతో పార్ట్-2 గురించి తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా ధురంధర్-2ను తెలుగులోనూ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నెల 19న మూవీ రిలీజైనప్పటికీ సాంకేతిక కారణాల వల్ల తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాలేదు.


