News February 7, 2025

కోహ్లీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ సెటైర్లు

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెటైర్లు వేశారు. ‘జనవరిలో మెడ నొప్పి.. ఫిబ్రవరిలో మోకాలు నొప్పి.. ఇదేం ఫిట్‌నెస్.. ఏదైతేనేం కటక్ మ్యాచ్ నాటికి కోహ్లీ పూర్తిగా కోలుకోవాలి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో మోకాలి గాయం కారణంగా కోహ్లీ బరిలోకి దిగని విషయం తెలిసిందే. ఆయన స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడారు.

Similar News

News February 7, 2025

రేపటి నుంచి TG ఓపెన్ చెస్ టోర్నీ

image

TG: రేపు, ఎల్లుండి చర్లపల్లిలో ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్టేట్ చెస్ అసోసియేషన్ (TSTA) తెలిపింది. బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో అండర్ 7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలు ఉంటాయని TSTA ప్రెసిడెంట్ KS ప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుందని, వివరాలకు 7337578899, 7337399299 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

News February 7, 2025

OTTలోకి వచ్చేసిన ‘గేమ్ ఛేంజర్’

image

శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కియారా, అంజలి, SJ సూర్య, జయరాం కీలక పాత్రల్లో నటించారు.

News February 7, 2025

అంతర్జాతీయ కోర్టుపై ట్రంప్ ఆంక్షలు

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి కోర్టు తన అధికారాల్ని దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. తమపై, తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌పై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. కోర్టు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబీకుల ఆస్తుల్ని ఫ్రీజ్ చేయడంతో పాటు ప్రయాణ ఆంక్షల్ని విధించారు.

error: Content is protected !!