News February 7, 2025

సంగారెడ్డి: మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం: ఎస్పీ

image

జిల్లాలో పూర్తిస్థాయిలో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ రూపేష్ గురువారం తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాలు సరఫరా చేసిన, విక్రయించిన 87126 56777 నంబర్‌కు తెలపాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

Similar News

News February 7, 2025

సమ్మక్క-సారలమ్మ గద్దెలపై హుండీలు ఏర్పాటు

image

మేడారం చిన్న జాతర ఈనెల 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో ఎండోమెంట్ అధికారులు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 14 హుండీలు, సారలమ్మ గద్దెపై 14 హుండీలు, పగిడిద్దరాజు గద్దెపై 2 హుండీలు, గోవిందరాజుల గద్దెపై 2 హుండీలు మొత్తం 32 హుండీలను ఏర్పాటు చేశారు. ఈవో రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతి, పరకాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ కవిత, అర్చకులు పాల్గొన్నారు.

News February 7, 2025

ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

image

ఆదిలాబాద్‌లో గురువారం రాత్రి బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు వివరాల ప్రకారం.. పట్టణంలోని అంకోలి రోడ్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న ఒక కారును ఢీకొనడంతో పాటు రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిని ఢీకొంది. దీంతో భీంపూర్ మండలంకు చెందిన గణేశ్, ఆదిలాబాద్‌కు చెందిన వెంకట్, నితిన్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు.

News February 7, 2025

వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

image

స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘనట హయత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్దఅంబర్‌పేటలో ఉంటున్నారు. ఆయన కుమార్తె రిత్విక హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయిందని వాపోయారు.

error: Content is protected !!