News March 19, 2024

ALERT: చేతులు సరిగా కడుక్కోవడం లేదా?

image

చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం మెదడులో టేప్‌వార్మ్స్(బద్దె పురుగులు) పెరగడానికి ఓ కారణమని అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్‌ వెల్లడించాయి. ఈ బద్దె పురుగు కణజాలాల్లోకి చొచ్చుకెళ్లి, అక్కడి నుంచి మెదడులోకి వెళుతుందట. ఉడకని పంది మాంసం తినేవారిలోనూ ఈ టేప్‌వార్మ్స్ గుర్తించినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. ఈ సమస్య ఉన్న వారి మలమూత్రాల ద్వారా కుటుంబ సభ్యులకూ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపింది.

Similar News

News November 24, 2024

పాక్‌‌కు షాక్.. తొలి వన్డేలో జింబాబ్వే గెలుపు

image

జింబాబ్వే టూర్‌ వెళ్లిన పాక్‌కు షాక్ తగిలింది. తొలి వన్డేలో 80పరుగుల తేడాతో ఓడింది. జింబాబ్వే తొలుత 40.2 ఓవర్లకు 205 రన్స్ చేసి ఆలౌటైంది. పాకిస్థాన్ 21 ఓవర్లకు 60/6 వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ నిలిపేశారు. ఆపై వాతావరణం ఆటకు అనుకూలించలేదు. 21 ఓవర్ల వద్ద జింబాబ్వే 125/7 స్థితిలో ఉండటంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం గెలుపును నిర్ణయించారు. 39రన్స్ చేసి 2వికెట్లు తీసిన సికందర్ రజా POMగా నిలిచారు.

News November 24, 2024

రూ.12.50 కోట్లు పలికిన జోఫ్రా ఆర్చర్

image

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేలంలో భారీ ధర పలికారు. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలానికి వచ్చిన అతడిని రూ.12.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇతడి కోసం ముంబై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. గతంలో ఇతడు RR, MI జట్ల తరఫున ఆడారు. కానీ గాయాల బెడదతో మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయారు.

News November 24, 2024

ప్రసిద్ధ్ కృష్ణకు రూ.9.5 కోట్లు, అవేశ్ ఖాన్‌కు రూ.9.75 కోట్లు

image

భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను GT కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌కు వచ్చిన అతడిని గుజరాత్ టైటాన్స్ రూ.9.50 కోట్లకు దక్కించుకుంది. మరో బౌలర్ అవేశ్ ఖాన్‌ను రూ.9.75 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.