News February 7, 2025

MNCL: రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే 4 నెలల ఉచిత శిక్షణలో అభ్యర్థులకు బుక్ ఫండ్, ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News September 16, 2025

రేపు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుండగా, 10.05 గంటలకు గౌరవ వందనం ఉంటుందన్నారు. అనంతరం ప్రసంగం చేస్తారని చెప్పారు.

News September 16, 2025

మంచిర్యాలలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు

image

మంచిర్యాలలో గోదావరి పుష్కరాల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎమ్మార్వో రపతుల్లా హుస్సేన్, ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్ రావు మంగళవారం పర్యటించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి గోదావరి నది తీరం వరకు రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం పుష్కర ఘాట్‌లను సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News September 16, 2025

మెదక్: అత్యధికంగా రేగోడ్‌లో 12.5 సెంమీల వర్షం

image

మెదక్ జిల్లాలో అత్యధికంగా రేగోడ్‌లో 12.5 సెంమీల వర్షం కురిసింది. సోమవారం రాత్రి కుండపోత మాదిరిగా వర్షం కురవడంతో మెదక్ పట్టణం చెరువును తలపించింది. కాగా జిల్లాలో పలు చోట్ల ఉదయం 8 గంటల వరకు వర్షపాత వివరాలు.. మినుపూర్ 108 మిమీ, కొల్చారంలో 102 మిమీ, మెదక్ పట్టణంలో 71 మిమీ, లింగాయిపల్లిలో 71 మిమీ, టేక్మాల్ 59.5 మిమీ వర్షం కురిసింది.