News February 7, 2025
సంగారెడ్డి: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

అంగన్వాడీ ఉద్యోగులు వివిధ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాలు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.
Similar News
News November 8, 2025
మొదలైన నెల్లూరు DRC మీటింగ్

నెల్లూరు జడ్పీ హాల్లో మరికాసేపట్లో జిల్లా సమీక్షా సమావేశం(DRC) మొదలైంది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో పలు అంశాలపై సమీక్షిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయం, ఇరిగేషన్ అంశాలపై చర్చిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. తుపాను నష్టంపై చర్చించి ఈనెల 10న జరిగే మంత్రి వర్గ ఉప సంఘానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.
News November 8, 2025
భద్రాద్రి రామయ్యకు నిత్య కళ్యాణ వేడుక

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసి అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదిర్చి విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ గావించి స్వామి వారికి నిత్య కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు.
News November 8, 2025
జూబ్లీ ఉప ఎన్నిక: నవంబర్ 11న Paid Holiday

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు నవంబర్ 11న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న ఉద్దేశంతో మంగళవారం వేతనంతో కూడిన సెలవు దినంగా (Paid Holiday) ప్రకటిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గ పరిధిలో మాత్రమే ఈ సెలవు వర్తిస్తుంది.
SHARE IT


