News February 7, 2025
NGKL: చెరువులో పడి మహిళ మృతి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీరంగాపురం చెరువులో మునిగి మహిళ మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 35 ఏళ్ల వయసున్న మహిళ చెరువులో మునిగి చనిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 28, 2026
చెన్నైకి బిగ్ షాక్.. 2 వారాలు ధోనీ దూరం

ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSKకు బిగ్ షాక్ తగిలింది. కండరాల గాయంతో బాధపడుతున్న మాజీ కెప్టెన్ ధోనీ మొదటి 2 వారాలు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది.
News March 28, 2026
శ్రీకాకుళం: త్వరలో కాలేజీల్లో ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్

ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయంబర్స్మెంట్ అర్హత సాధించాలంటే విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు ఉండాలి. మాన్యువల్ హాజరు వల్ల అనర్హులకు రియంబర్స్మెంట్ అందుతుందని ప్రభుత్వ భావన. అందుకే ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేస్తుంది. జిల్లాలో నాలుగు ఇంజినీరింగ్, 101 డిగ్రీ, 14 బీఈడీ, ఆరు పీజీ, 9 పాలిటెక్నిక్ తదితర కళాశాలల్లో రూ. కోట్లలో రియంబర్స్మెంట్ పొందుతున్నారు.
News March 28, 2026
కర్నూల్ బిడ్డ దుమ్మురేపింది!

కర్నూలుకు చెందిన డెఫ్ టెన్నిస్ ఛాంపియన్, నేషనల్ అవార్డీ షేక్ జాఫ్రీన్ దేశ గర్వకారణంగా నిలిచారు. చండీగఢ్‌లో జరిగిన నేషనల్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకమని క్రీడాభిమానులు కొనియాడారు. 2026 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో జాఫ్రీన్ మరిన్ని విజయాలు సాధించి దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


