News February 7, 2025

సోనూసూద్‌ అరెస్ట్‌కు వారెంట్

image

నటుడు సోనూసూద్‌కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. మోహిత్ అనే వ్యక్తి ‘రిజికా కాయిన్‌’లో పెట్టుబడి పేరుతో ₹10L మోసం చేశాడని, దీనికి సోనూసూద్ సాక్షి అని పేర్కొంటూ రాజేశ్ అనే లాయర్ కేసు వేశారు. కోర్టు పంపిన సమన్లకు సోనూసూద్ స్పందించకపోవడంతో జడ్జి తీవ్రంగా స్పందించారు.

Similar News

News March 6, 2026

మొక్క జొన్న రైతుల బకాయిలు విడుదల

image

TG: మొక్క జొన్న రైతుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. మార్క్‌ఫెడ్‌కు ₹171 కోట్లు రిలీజ్ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒకటీరెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. ‘వానాకాలానికి సంబంధించి 78,500 మంది నుంచి 3.77 లక్షల టన్నుల మొక్కజొన్నలు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. తొలిదశలో ₹735.39 కోట్లు చెల్లించాం. మిగతా నిధులను తాజాగా రిలీజ్ చేశాం’ అని పేర్కొన్నారు.

News March 6, 2026

రష్యా ఆయిల్ కొనుగోలు.. వెనక్కి తగ్గిన US

image

రష్యా ఆయిల్ కొనేందుకు 30 రోజుల పాటు భారత్‌కు US తాత్కాలిక మినహాయింపు ఇచ్చిందని ఆ దేశ ఉన్నతాధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాషింగ్టన్ దీనికి అంగీకరించినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం సముద్ర జలాల్లో ఉన్న రష్యా ఆయిల్‌ను కొనేందుకే అనుమతి ఇచ్చినట్లు చెప్పింది. కాగా భారత్ వద్ద కేవలం 25 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలే ఉన్నట్లు తెలుస్తోంది.

News March 6, 2026

ప్రైవేట్ స్కూళ్లకు ‘ప్రొఫెషనల్’ షాక్

image

TG: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. వసూలు చేసే బాధ్యత డీఈవోలకు అప్పగిస్తూ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులకు కళ్లెం వేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మొత్తం 11 వేల ప్రైవేటు స్కూళ్లలో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను సేకరించే పనిలో ఉంది.