News February 7, 2025
మరోసారి SA20 ఫైనల్‌కు సన్‌రైజర్స్

‘SA20’లో ఎలిమినేటర్‌లో పార్ల్ రాయల్స్‌పై గెలిచి సన్‌రైజర్స్(SEC) ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 175/4 స్కోరు చేసింది. రూబిన్(81), ప్రిటోరియస్(59) రాణించారు. ఛేజింగ్‌లో SEC ఓపెనర్ జోర్జీ(78), జోర్డాన్(69) తడబడకుండా ఆడారు. ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్‌టైన్(MICT)తో రేపు రాత్రి 9గంటలకు సన్‌రైజర్స్ తలపడనుంది. మార్క్రమ్ సేన తొలి రెండు సీజన్లు కప్ కొట్టిన సంగతి తెలిసిందే.
Similar News
News April 16, 2026
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్‌కు చెందిన లోన్ అకౌంట్లను బ్యాంకులు ఫ్రాడ్‌గా పేర్కొని దర్యాప్తు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అనిల్ అంబానీ వేసిన పిటిషన్‌ను SC కొట్టివేసింది. ఈ దశలో స్టే విధించలేమని ధర్మాసనం పేర్కొంది. తొలుత బాంబే HC సింగిల్ బెంచ్ అంబానీకి ఫేవర్‌గా తీర్పునిచ్చింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, IDBI పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్ దీనిని పక్కన పెట్టింది.
News April 16, 2026
మార్కెట్ షేర్‌లో మారుతీ రివర్స్ గేర్

2026 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ మార్కెట్ షేర్ 39.26%కి పడిపోయింది. 13 ఏళ్లలో ఇదే కనిష్ఠం. ఒకప్పుడు సగానికి పైగా మార్కెట్‌ను ఏలిన మారుతీ.. పెరుగుతున్న పోటీ, కస్టమర్ల అభిరుచులు మారడంతో వరుసగా మూడో ఏడాదీ వెనకబడింది. 2020 నుంచి చూస్తే కంపెనీ ఏకంగా 12% మార్కెట్ షేర్‌ను కోల్పోయిందని SIAM గణాంకాలు చెబుతున్నాయి. ఇతర కంపెనీల SUVs హవా పెరగడమే మారుతీకి నెగటివ్‌గా మారినట్లు స్పష్టమవుతోంది.
News April 16, 2026
దేవతలు కలలో వస్తే ఏం జరుగుతుంది?

కలలో దేవతలు కనిపించడం శుభప్రదమట. ఇది మీపై దైవానుగ్రహం ఉందని, త్వరలోనే మీ సమస్యలు తొలగిపోతాయని సూచనట. అలాగే శుభవార్తలు వింటారని చెప్పడానికి సంకేతమని స్వప్నశాస్త్రం చెబుతోంది. ‘దేవతలు ఆశీర్వదిస్తున్నట్లు, చిరునవ్వుతో కనిపిస్తే తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కోపంగా ఉన్నట్లు కనిపిస్తే మీరు ఏదైనా ధర్మ కార్యంలో పొరపాటు చేస్తున్నారని, మొక్కులు మరచిపోయారని అర్థం’ అని సూచిస్తున్నారు నిపుణులు.


