News February 7, 2025
నేడు వైసీపీలోకి శైలజానాథ్

మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ నేడు వైసీపీలో చేరనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఆయన శింగనమల నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. కష్టసమయంలో వైసీపీ గూటికి చేరుతున్న ఆయనకు జగన్ ఎలాంటి బాధ్యత అప్పగిస్తారన్న విషయమై జిల్లాలో ఆసక్తి నెలకొంది.
Similar News
News March 20, 2026
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్లు షురూ

2026-27 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో(KV) అడ్మిషన్లకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో ప్రవేశాలకు <
Share It
News March 20, 2026
అనకాపల్లి: ఈనెల 24న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు

జిల్లాస్థాయి శాప్ లీగ్స్ అథ్లెటిక్స్(మాస్టర్స్) పోటీలు ఈనెల 24న అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి పి.శైలజ శుక్రవారం తెలిపారు. 35, 45 ఏళ్ల పైబడిన విభాగాల్లో పురుషులు, మహిళలకు వేరువేరుగా పోటీలు జరుగుతాయన్నారు. వీటిలో ఎంపికైన వారు ఈనెల 30, 31 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్తారన్నారు.
News March 20, 2026
తిరుపతి జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారిగా హరీశ్

తిరుపతి జిల్లా ఎస్సీ వెల్ఫేర్&ఎంపవర్‌మెంట్ ఆఫీసర్ (DSCW & EO)గా వి.వి. హరీశ్ కొల్ల బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని హరీశ్ తెలిపారు.


