News February 7, 2025
నెక్కొండ: ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలేనా..?
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని ఆ గ్రామాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. రాబోయేది పంచాయతీ ఎన్నికలా..? లేక మున్సిపల్ ఎన్నికలో తెలియక ప్రజలు ఎదురు చూస్తున్నారు. నెక్కొండను మున్సిపాలిటీగా చేసేందుకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేశారు. నెక్కొండతో పాటు నెక్కొండ తండా, టీకే తండా, గుండ్రపల్లి, అమీన్పేటల్లో గ్రామ సభలను సైతం నిర్వహించారు. కానీ ఇంత వరకు స్పష్టత లేకపోవడంతో ప్రజలు, అధికారులు అయోమయంలో పడ్డారు.
Similar News
News February 7, 2025
వరంగల్ ‘కారు’ స్టీరింగ్ పోస్టు ఖాళీ..!
వరంగల్ జిల్లా BRS అధ్యక్ష పదవి ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆరూరి రమేష్ పార్టీని వీడారు. ఆ తర్వాత కారు స్టీరింగ్ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. కీలకమైన జిల్లా అధ్యక్ష స్థానం ఖాళీగా ఉండడంతో నియోజకవర్గాల్లో నేతలు అంతంతమాత్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేయాలని కోరుతున్నారు.
News February 7, 2025
స్థానిక ఎన్నికలు: వరంగల్ జిల్లా పూర్తి వివరాలు
గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన వరంగల్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు-4, మున్సిపాలిటీలు-2, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో ZPTC-11, MPP-11 MPTC-126, గ్రామ పంచాయతీలు-315 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
News February 7, 2025
సమ్మక్క-సారలమ్మ గద్దెలపై హుండీలు ఏర్పాటు
మేడారం చిన్న జాతర ఈనెల 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో ఎండోమెంట్ అధికారులు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 14 హుండీలు, సారలమ్మ గద్దెపై 14 హుండీలు, పగిడిద్దరాజు గద్దెపై 2 హుండీలు, గోవిందరాజుల గద్దెపై 2 హుండీలు మొత్తం 32 హుండీలను ఏర్పాటు చేశారు. ఈవో రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతి, పరకాల డివిజన్ ఇన్స్పెక్టర్ కవిత, అర్చకులు పాల్గొన్నారు.