News February 7, 2025
అందాల పోటీల్లో చంద్రగిరి అమ్మాయికి కిరీటం.. CM ప్రశంస

మలేషియాలో జరిగిన మిస్ గ్లోబల్ ఆసియా-2025 విజేతగా చంద్రగిరికి చెందిన భావన రెడ్డి నిలిచారు. 18 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి మిస్ గ్లోబల్ ఆసియా-2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె గురువారం CM చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ వేదికపై తిరుపతి పేరును గట్టిగా వినిపించిన ఆమెను CM అభినందించారు.
Similar News
News April 17, 2026
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

ఈనెల 25న జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు (పాలిసెట్) పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 15 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏలూరులో 9, నూజివీడులో 3, జంగారెడ్డిగూడెంలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News April 17, 2026
పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పెద్దపులి సంచారం

పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా పులి కదలికలను గుర్తిస్తూ, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ డ్రోన్లు, ట్రాంక్విలైజర్ గన్‌లతో గాలింపు చేపడుతోంది. పులికి హాని కలగకుండా త్వరలోనే బంధిస్తామని, అప్పటివరకు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారి ఎస్.కె. వలీ సూచించారు.