News February 7, 2025
TCS ఉద్యోగులకు షాక్.. వేరియబుల్ పేలో భారీ కోత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736436056806_1124-normal-WIFI.webp)
ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. 2024-25 Q3లో వారి వేరియబుల్ పేలో భారీ కోత పెట్టినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నప్పటికీ వరుసగా రెండో క్వార్టర్‌లోనూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తొలి త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే అలవెన్స్ ఇవ్వగా, Q2లో 20-40 శాతానికి పరిమితం చేసింది. తనకు 50K-55K రావాల్సి ఉండగా Q2లో సగం, Q3లో ఇంకా తగ్గిందని ఓ ఉద్యోగి చెప్పారు.
Similar News
News February 7, 2025
ఆ కామెంట్స్ నేను పట్టించుకోను: హర్షిత్ రాణా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738907947629_1045-normal-WIFI.webp)
ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను దించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై రాణా స్పందించారు. ‘అనేవాళ్లు అంటూనే ఉంటారు. అవేవీ నేను పట్టించుకోదలచుకోలేదు. నా ఆటపైనే తప్ప వేరే వాటిపై దృష్టి పెట్టను’ అన్నారు. గ్రౌండ్‌కి వచ్చిన తర్వాతే తాను అరంగేట్రం చేస్తున్నట్లు తెలిసిందని.. దానికి ముందుగానే సిద్ధమై ఉన్నానని తెలిపారు.
News February 7, 2025
ట్యాక్స్ బెన్ఫిట్స్‌తో ఇలా చేయండి: డా.ముఖర్జీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738905125690_746-normal-WIFI.webp)
కేంద్రం ట్యాక్స్ భారాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రజలకు డాక్టర్ ముఖర్జీ చిన్న సలహా ఇచ్చారు. ‘ట్యాక్స్ బెన్ఫిట్స్ వల్ల మిగిలిన అదనపు డబ్బును హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంగా పెట్టడం మంచి మార్గం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆస్పత్రి ఖర్చులు భరించడం కష్టం. సేవింగ్స్ మొత్తం ఖర్చవకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు చెప్పిరావు కాబట్టి ఏళ్ల తరబడి ఆదా చేసిన డబ్బు రోజుల్లో ఖాళీ అవుతుంది’ అని Xలో రాసుకొచ్చారు.
News February 7, 2025
నాకు అరెస్ట్ వారెంట్ వచ్చిందనడం అబద్ధం: సోనూ సూద్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738908431065_1045-normal-WIFI.webp)
తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తలు అబద్ధమని నటుడు సోనూ సూద్ ట్విటర్లో తెలిపారు. ‘సోషల్ మీడియాలో ఈ అంశాన్ని సెన్సేషనలైజ్ చేస్తున్నారు. మాకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు నన్ను పిలిచింది. ఈ కేసులో దేనికీ నేను బ్రాండ్ అంబాసిడర్‌ను కాదు. పబ్లిసిటీ కోసం నా పేరును కొందరు వాడుతున్నారు. ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకోనున్నాం’ అని పోస్ట్ పెట్టారు.