News February 7, 2025
ఇకపై లేఖర్ల అవసరం లేదు: డీఐజీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738888615572_19090094-normal-WIFI.webp)
ఆస్తి రిజిస్ట్రేషన్లకు ఇకనుంచి లేఖర్లు అవసరం లేదని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ జి.బాలకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాడుగుల రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికి వారే రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చునని పేర్కొన్నారు. ఆస్తి కొనుగోలుదారులు చలానా తీసిన వెంటనే అన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామన్నారు.
Similar News
News February 7, 2025
MHBD: మిర్చి రైతుకు మిగిలిన కన్నీళ్లు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738907243271_50311560-normal-WIFI.webp)
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మిర్చి పంట వేయడానికి రైతులు మక్కువ చూపుతారు. ఎంతో కష్టపడి పండించిన మిర్చి పంటకు ఈ సంవత్సరం గిట్టుబాటు ధర రాక రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గత సంవత్సరం గరిష్ఠంగా క్వింటా రూ.20- 23 వేల మధ్య ఉన్న ధర, ప్రస్తుతం రూ.12-14 వేలు చెల్లిస్తున్నారు. అయితే తెగుళ్ల కారణంగా పంట దిగుబడి తగ్గుతూ, మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు మనోవేదనకు గురవుతున్నారు.
News February 7, 2025
కరీంనగర్: రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని రైతు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738909213299_1259-normal-WIFI.webp)
కొత్తపల్లి శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన రైతు జంగిలి అంజయ్య(65) మృతి చెందారు. కొత్తపల్లి సంతకు వచ్చి సామగ్రిని కొనుగోలు చేసి తిరిగి సైకిల్‌పై వెలిచాల వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అంజయ్య తీవ్రగాయాలతో మృతి చెందారు. అంజయ్య మృతదేహాన్ని KNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చూరీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.
News February 7, 2025
NZB: ఆస్తి పన్ను వసూలు చేయాలి: కమిషనర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738908406966_50139228-normal-WIFI.webp)
నిర్లక్ష్యం చేయకుండా నగరంలో ఆస్తి పన్ను వసూలు చేయాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశించారు. ఆయన నగరపాలక సంస్థ స్పెషల్ టీం ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, సపోర్టింగ్ సిబ్బందితో సమావేశమై ఆస్తిపన్ను విషయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీగా పెండింగ్లో ఉన్న వారి నుంచి త్వరితగతిన పన్ను వసూలు చేసేలా చూడాలన్నారు.