News March 19, 2024
శ్రీకాకుళం జిల్లాలో రేపు పిడుగులతో భారీ వర్షాలు

ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, మంగళవారం రాజాం, పలాస, సీతంపేట, టెక్కలి ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రేపు పిడుగులు పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Similar News
News April 3, 2026
శ్రీకాకుళంలో బీర్లు ఎక్కువగా తాగేస్తున్నారు..!

శ్రీకాకుళం జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1207.91 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో మద్యం బాక్సులు 16.97లక్షలు కాగా.. బీరు బాక్సులు రూ.8.06లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1213.06కోట్ల విక్రయాలు జరిగాయి. గతంలో పోలిస్తే 2025-26లో అమ్మకాలు పెరగలేదు. 2024-25లో బీర్లు 5.19లక్షల బాక్సులు అమ్ముడుపోగా.. 2025-26లో ఆ సంఖ్య 8.06లక్షలకు పెరిగింది.
News April 3, 2026
రేపు శ్రీకాకుళం జిల్లాలో YCP పూజలు

తిరుమల పవిత్రతను కాపాడే దిశగా టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి బీఆర్. నాయుడిని వెంటనే తొలగించాలని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈనెల 4న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
News April 3, 2026
శ్రీకాకుళం: POLYCET..అప్‌డేట్

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (POLYCET -2026) దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచినట్లు జిల్లా ప్రవేశాల ఇన్‌ఛార్జి, శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. నారాయణ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 4తో స్వీకరణ గడువు ముగుస్తుండగా, సాంకేతిక విద్యాశాఖ ఈనెల 9 వరకు పెంచిందని ప్రకటనలో వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోవాలన్నారు.


