News February 7, 2025
భువనగిరి: వెటర్నరీ డాక్టర్‌పై అడవి దున్న దాడి

యాదాద్రి జిల్లాలో కొన్ని రోజుల నుంచి అడవి దున్న హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో ప్రత్యక్షమవగా సాయంత్రం వలిగొండ శివారులో కనిపించింది. ఫారెస్ట్ అధికారులు దున్నను పట్టుకునే ప్రయత్నంలో చేయగా జూడా సజావుద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేసినట్లు డీఎఫ్ఓ పద్మజారాణి తెలిపారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించామన్నారు.
Similar News
News November 11, 2025
ఢిల్లీ పేలుళ్లు.. గుంటూరు పోలీసుల అప్రమత్తం

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత కోసం రైల్వేస్టేషన్, బస్టాండ్, వాణిజ్య సముదాయాలు, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు సంచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
News November 11, 2025
NZB: ఢిల్లీలో పేలుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎంపీ

ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ అర్వింద్ ట్వీట్ చేశారు.
News November 11, 2025
జిల్లాలో కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించాలి: జేసీ

ఈ నెల 17 నుంచి 30 వరకు కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమంపై సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ హాలులో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలన్నారు.


