News February 7, 2025
రూ.99లతో విజయవాడ నుంచి హైదరాబాద్

విజయవాడ-హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించారు. 3,4 వారాల తర్వాత ఇవి తిరుగుతాయన్నారు. బస్సు సేవలు మొదలైన తర్వాత రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు టికెట్ ఛార్జీ ఉంటుందన్నారు. ఈ విధంగా నాలుగు వారాల పాటు ఉంటుందన్నారు.
Similar News
News January 20, 2026
నంద్యాల: ఉద్యోగం పేరిట రూ.6,60,000 మోసం

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.6,60,000 మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని SP సునీల్ షొరాణ్‌కు నంద్యాలకు చెందిన శ్రీధర్ రావు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంపత్ కుమార్ రెడ్డి తనను మోసం చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 93 ఫిర్యాదులు అందగా.. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
News January 20, 2026
భక్తులకు TTD గుడ్ న్యూస్.. ఇక రెండుపూటలా అన్నప్రసాదం!

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు మార్చి నెలాఖరు నుంచి TTD పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాదం అందించనున్నట్లు EO అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మొత్తం 56 ఆలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వీటితో పాటు ఖాళీగా ఉన్న AE పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ నిర్వహించాలని, కొత్తగా ఎంపికైన వేద పారాయణదారులకు నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
News January 20, 2026
అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వ పథకాలు చేరాలి: డిప్యూటీ సీఎం

కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పట్టణ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల మంజూరులో జాప్యం జరగకూడదని ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి మహిళకు చేరాలన్నారు.


