News February 7, 2025
సిరిసిల్ల: కుక్కల వల్ల చిన్నారికి సోకిన వైరస్

కోనరావుపేట(M) కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ(4) అనే చిన్నారికి జ్వరంతో పాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది. అవి ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్నిరకాల పరీక్షలు చేసినా నిర్ధారణ కాకపోవడంతో 4రోజుల క్రితం HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రూసెల్లా ఇథి పీకల్ వైరస్ గా గుర్తించారు. కుక్కల కారణంగా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు.
Similar News
News September 16, 2025
వనపర్తి: నిరుద్యోగులకు జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు హైదరాబాద్‌లోని వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర సహకారంతో సెప్టెంబర్ 18న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి వెంకటేశ్వర్ల రాజు తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలన్నారు. SSC, ITI, DEGREE అర్హతలన్నారు.
News September 16, 2025
దేవుడి భూములను కొట్టేస్తే సమగ్ర విచారణ చేసుకోండి – పేర్ని నాని

మచిలీపట్నంలోని రంగనాయక స్వామి దేవస్థానంకు చెందిన భూములను తాను కారు చౌకగా కొట్టేశానని కూటమి నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నిజంగా స్వామి వారి భూములను తాను అక్రమ మార్గంలో తీసుకుంటే నాడు జరిగిన వేలంపాటపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అవినీతిని తాను బట్టబయలు చేస్తుండటంతో తనపై కక్ష కట్టి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News September 16, 2025
వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ

AP: వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కోర్టు తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.