News February 7, 2025

గురుకులాల్లో ప్రవేశాలు.. ముగిసిన దరఖాస్తు గడువు

image

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. 643 గురుకులాల్లో మొత్తం 51,968 సీట్లు ఉండగా, 1.67లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఐదో తరగతికే 88,824 అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనుండగా, మే 15 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి జూన్ 12 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు.

Similar News

News December 26, 2025

బంగ్లాదేశ్ అందరిదీ: తారిఖ్ రెహమాన్

image

రాజకీయం, మతాలతో సంబంధం లేని బంగ్లాదేశ్‌ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని BNP తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ అన్నారు. దేశ పౌరులు శాంతి కాంక్షించాలని కోరారు. ఇంటి నుంచి బయటికి వెళ్లినవారు సురక్షితంగా తిరిగి రాగల దేశాన్ని చూడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దేశం ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులకు సమానంగా చెందుతుందన్నారు. 17ఏళ్ల తర్వాత దేశంలో అడుగుపెట్టిన తారిఖ్ PM రేసులో ఉన్నారు.

News December 26, 2025

యశ్ దయాల్ స్థానంలో ఉమేశ్ యాదవ్?

image

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB బౌలర్ యశ్ దయాల్ స్థానంలో IND సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను వచ్చే సీజన్‌లో జట్టులోకి తీసుకోనున్నట్లు క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. పోక్సో కేసు నమోదైన యశ్‌ను జట్టులో ఎలా కొనసాగిస్తారని RCBపై విమర్శలొస్తున్నాయి. తాజాగా అతని ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. దీంతో ఉమేశ్‌ను తీసుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై RCB నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

News December 26, 2025

సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు: బీసీ జనార్దన్

image

AP: రాష్ట్రంలోని రోడ్లను సంక్రాంతి నాటికి గుంతల రహితంగా తీర్చిదిద్దాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల ఆర్&బి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో రోడ్ల పరిస్థితి, జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గతేడాది సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన ప్రజలు, స్థానికులు రహదారులు మెరుగుపడటంపై సంతోషం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.