News February 7, 2025

గోకవరంలో కాకినాడ జిల్లా యువకుడి మృతి

image

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో కొత్తపల్లి నుంచి కామరాజుపేటకు వెళ్లే జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా బెండపూడికి చెందిన సతీష్ (18)గా పోలీసులు గుర్తించారు. సతీష్ అమ్మమ్మ ఊరైన కామరాజుపేటకి తన స్నేహితుడితో వచ్చాడని, అంతలోనే ప్రమాదం జరిగి చనిపోయాడని SI పవన్ కుమార్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News July 6, 2025

మా విషయం ఇండియా మొత్తం తెలుసు: చాహల్

image

ఆర్జే మహ్వాష్‌తో డేటింగ్‌పై టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ స్పందించారు. కపిల్ శర్మ షోలో అతడి డేటింగ్ ప్రస్తావన వచ్చింది. ‘కౌన్ హై వో లడ్కీ’ అంటూ కపిల్ ప్రశ్నించారు. దీనికి చాహల్ స్పందిస్తూ ‘నాలుగు నెలల కిందటే మా డేటింగ్ విషయం ఇండియా మొత్తం తెలుసు’ అని సమాధానమిచ్చారు. ప్రత్యక్షంగా ఆమె పేరు ప్రస్తావించకపోయినా క్లారిటీ ఇచ్చాడని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

News July 6, 2025

వనపర్తి: జీవో నంబర్ 282ను వెంటనే రద్దు చేయాలి

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని దినం 8 గంటల నుంచి పది గంటలకు పెంచుతూ దొడ్డిదారిన జీవో నంబర్ 282 ను తెచ్చిందని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) రాష్ట్ర కార్యదర్శి పి సురేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కార్మికులు దశాబ్దాలుగా పోరాడి ఎనిమిది గంటల పరిధిలో సాధించుకున్నారన్నారు. శ్రమదోపిడి చేసే అందుకే 10 గంటలకు పెంచారని, జీవో రద్దు చేయాలన్నారు.

News July 6, 2025

తుని: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ

image

తునిలో జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, వంటశాల, టాయిలెట్లు పరిశీలించారు. పిల్లల ఆరోగ్యాన్ని రోజూ పర్యవేక్షించాలని ప్రిన్సిపల్ యజ్ఞ‌ను ఆదేశించారు. మెరుగైన విద్యను అందించాలని సూచించారు.