News February 7, 2025

సినిమా రంగంలో కురవి కుర్రాడు!

image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. శుక్రవారం విడుదలయ్యే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేయనున్నారు.

Similar News

News October 28, 2025

కామారెడ్డి: పోలీసుల నిర్లక్ష్యం.. సస్పెన్షన్‌

image

పాస్‌పోర్ట్‌ విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు జిల్లా ఎస్పీ రాజేష్‌ చంద్ర మంగళవారం సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. డీఎస్‌బీ విభాగంలో పనిచేసిన భిక్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఎఎస్‌ఐ నర్సయ్య, రామారెడ్డి స్టేషన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్‌ రెడ్డిపై ఇన్‌ఛార్జ్ డీఐజీ సన్‌ప్రీత్‌ సింగ్‌ సస్పెన్షన్‌ ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతారాహిత్యానికి పోలీసు శాఖలో స్థానం లేదని ఎస్పీ తెలిపారు.

News October 28, 2025

రెటినోపతి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలో ఏ ఒక్కరూ రెటినోపతి భారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు సూచించారు. జిల్లా మెడికల్ కళాశాల ఆప్తల్ మాలజీ విభాగం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నవంబర్ 14 నుంచి వంద రోజుల వైద్య పరీక్షల కార్యాచరణ ప్రక్రియ ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 28, 2025

గోళ్లు అందంగా ఉండాలంటే ఇలా చేయండి

image

చేతులు అందంగా ఉండటంలో గోళ్లు ప్రముఖపాత్ర పోషిస్తాయి. వీటిని సంరక్షించుకోవడానికి మీ కోసం కొన్ని చిట్కాలు. రెగ్యులర్‌గా గోళ్లను కట్ చేసుకోవాలి. గోళ్లు ఎక్కువగా నీటిలో నానకుండా పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మీ నెయిల్స్, క్యూటికల్స్‌ను మాయిశ్చరైజ్ చెయ్యాలి. నెయిల్ పెయింట్​ ఎక్కువ కాలం ఉంచకుండా చూసుకోవాలి. ఫంక్షన్ల వంటివి పూర్తయిన తర్వాత.. పాలిష్ రిమూవ్ చేసుకోవడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.