News February 7, 2025
సిరిసిల్ల: కుక్కల వల్ల చిన్నారికి సోకిన వైరస్
కోనరావుపేట(M) కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ(4) అనే చిన్నారికి జ్వరంతో పాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది. అవి ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్నిరకాల పరీక్షలు చేసినా నిర్ధారణ కాకపోవడంతో 4రోజుల క్రితం HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రూసెల్లా ఇథి పీకల్ వైరస్ గా గుర్తించారు. కుక్కల కారణంగా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు.
Similar News
News February 7, 2025
కరీంనగర్: ఈనెల 17 నుంచి MBA, MCA పరీక్షలు
KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని MBA, MCA మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. ఎన్. వి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, MCA థియరీ పరీక్షలు 22న, MBA థియరీ పరీక్షలు 24 న ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
News February 7, 2025
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గోదావరిఖని వాసులు మృతి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి HYD వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న గోదావరిఖనికి చెందిన బాణేష్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 6, 2025
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మహా మండపంలో వేదోచ్చరణతో స్వాగతం పలికి, శేష వస్త్రంతో సత్కరించి, లడ్డు ప్రసాదం అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు