News February 7, 2025
ఆరు సెక్టార్లుగా బందోబస్తు: SP కృష్ణారావు
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తీర్థం జరిగే ప్రాంతాన్ని ఆరు సెక్టార్లుగా విభజించామని కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. సెక్టార్ల వారీగా సిబ్బందికి విధుల కేటాయింపుపై ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలుజరగకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు ప్రసాద్, మురళీమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 7, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వి.నరేందర్ రెడ్డి
ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్,మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వి.నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
News February 7, 2025
సెలవు ఇవ్వలేదని…
ఆఫీస్‌లో సెలవు ఇవ్వలేదని నలుగురు సహోద్యోగులను పొడిచిన ఘటన బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది. అమిత్ కుమార్ సర్కార్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నిన్న అతడు లీవ్ కోసం అప్లై చేయగా రిజెక్ట్ అయింది. ఈ విషయంపైనే తోటి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగిన అతడు కత్తితో నలుగురిపై దాడి చేశాడు. అనంతరం కత్తి, రక్తం మరకలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 7, 2025
ఆపరేషన్ టైగర్: శిండే గూటికి ఠాక్రే ఎంపీలు!
మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ హాట్‌టాపిక్‌గా మారింది. ఉద్ధవ్ ఠాక్రే SSUBT 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే శివసేనలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే చర్చలు ముగిశాయని, వచ్చే పార్లమెంటు సెషన్‌లోపు వీరు చేరడం ఖాయమేనని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో NDA అధికారంలో ఉండటం, ఐదేళ్ల వరకు నిధులు లేకుండా మనుగడ కష్టమవ్వడమే ఇందుకు కారణాలని టాక్. 2/3 వంతు MP/MLAలు మారితే పార్టీ మార్పు నిరోధక చట్టం వర్తించదు.