News February 7, 2025
రేపటి నుంచి TG ఓపెన్ చెస్ టోర్నీ

TG: రేపు, ఎల్లుండి చర్లపల్లిలో ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్టేట్ చెస్ అసోసియేషన్ (TSTA) తెలిపింది. బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో అండర్ 7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలు ఉంటాయని TSTA ప్రెసిడెంట్ KS ప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుందని, వివరాలకు 7337578899, 7337399299 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News April 18, 2026
‘మే’లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జూన్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
News April 18, 2026
సోమవారం రెండో విడత శాంతి చర్చలు!

అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. అందుకు మరోసారి పాకిస్థాన్‌ను వేదికగా ఎంచుకున్నాయి. ఇస్లామాబాద్‌లో వచ్చే సోమవారం చర్చలు జరపనున్నట్లు సమాచారం. రేపు ఇరాన్ ప్రతినిధులు పాక్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.
News April 18, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.


